ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు : జేసీ దివాకర్ రెడ్డి

-

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానన్న ఆయన లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని అన్నారు. తన భార్య , చెల్లి పేరుతో గనులు ఉన్నాయని అక్కడికి పదుల సంఖ్యలో వాహనాల్లో 50 నుంచి 60 మంది వెళ్లి గనులను శోధించారని అన్నారు. వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమన్నా గనులకు వచ్చారా…నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నానని అన్నారు. గనులు సొరంగం లాగా ఉన్నాయని అందుకే పోలీసులు కూంబింగ్ కు వచ్చారని అనుకున్నానని అన్నారు. అనంతవెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతల గనులున్నా నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే శోధించారని అన్నారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకు ఇలా చేశారన్న ఆయన ఇప్పటికే అన్ని రకాల కేసుల నా కుటుంబంపై పెట్టారని అన్నారు.

ఏమీ లేకుంటా ఎస్సీ యాక్టు పెట్టి నా బ్రదర్ ను లోపల వేశారన్న ఆయన కేసులన్నీ కక్ష సాధింపులో భాగమేనని అన్నారు.. ఇప్పటి వరకు దివాకరరెడ్డిని టచ్ చేయలేకపోయారని, బహుశ నేను మా వాడు మా వాడు అంటున్నా కదా ఆసంబంధంతోనే ఏమీ చేయలేదేమో అన్నారు. గనులను క్లోజ్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ఆయన… ఈ గనులు తప్ప ఇతర ఆస్తిపాస్తులు ఏమీ నాకు లేవని, అందులో వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నాము..ఏమీ లేకుండా మాడ్చి చంపడానికి ఇలా చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version