జేఈఈ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారా..? అయితే సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ టిప్స్‌ మీకోసం..!

-

జేఈఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా..? దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశం కోసం ఇది తప్పనిసరి. అందుకే విద్యార్థులు బాగా దృష్టి పెట్టాలి. అలానే బాగా ప్రిపేర్ అయితే మంచిగా స్కోర్ చెయ్యడానికి అవుతుంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇక సెషన్ 2 అయితే… జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 మరియు 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరి బాగా స్కోర్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి..?, ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

JEE పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం ఇలా మూడు విభాగాలుగా విభజించారు. దీని ప్రకారం సబ్జక్టుల వారీగా ప్లాన్ చేసుకోవాలి విద్యార్థులు. అప్పుడు బాగా స్కోర్ చెయ్యడానికి అవుతుంది. అలానే ఇక సబ్జెక్టు మరియు వాటిలో ముఖ్యమైన టాపిక్స్ ఏమిటి అనేది చూస్తే..

ఫిజిక్స్:

మెకానిక్స్, ఫ్లూయిడ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ & ఎలెక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్ ముఖ్యమైనవి.

అలానే ఫిజిక్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్టిక్స్ అండ్ మోడరన్ ఫిజిక్స్ కూడా ముఖ్యమైన టాపిక్స్. కనుక వీటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

కెమిస్ట్రీ:

కెమిస్ట్రీ లో చూస్తే.. క్వాలిటేటివ్ అనాలిసిస్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ & కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీని బాగా చదువుకోండి. అలానే ఆల్డిహైడ్ & కీటోన్, ఆల్కైల్ & ఆర్గానిక్ కెమిస్ట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్ కూడా ముఖ్యమైన పాఠాలు.

మ్యాథ్స్:

క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ & ఎక్స్‌ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, వెక్టర్స్ & 3D జ్యామితి, బీజగణితంలో మాత్రికలు; కోఆర్డినేట్ జ్యామితిలో సర్కిల్, పారాబోలా టాపిక్స్ చాలా ముఖ్యం.

అలానే హైపర్బోలా; విధులు, పరిమితులు, కొనసాగింపు, భేదం, ఉత్పన్నాల అప్లికేషన్లు కూడా చాలా ముఖ్యమైనవే.

ఏ సబ్జెక్ట్‌ను, ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అన్నీ సబ్జెక్టులకు సమానంగా సమయాన్ని కేటాయించండి.
అలానే బాగా అన్నింటినీ చదువుకోండి.
ప్రతీ దానిని కూడా రివైజ్ చేసుకోండి.
పక్కాగా టైమ్‌ టేబుల్‌ సిద్ధం చేసుకోవాలి.
మొదట థియరీ భాగాన్ని కంప్లీట్‌ చెయ్యండి.
తరవాత ప్రాబ్లమ్స్ చేస్తే బెస్ట్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version