Breaking : జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా

-

దేశ‌వ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్నట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు వెల్లడించారు. ఇదివ‌ర‌కు విడుద‌లైన షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ప‌రీక్ష‌కు ఒక రోజు ముందుగా ఈ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఎన్టీఏ బుధ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది.

ప‌రీక్ష‌ల వాయిదాకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఎన్టీఏ వెల్ల‌డించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం నుంచి మొద‌లు కావాల్సిన జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 25 నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది ఎన్టీఏ. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను గురువారం నుంచి అభ్య‌ర్థులు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది ఎన్టీఏ. జేఈఈ మెయిన్స్ తొలి విడ‌త ప‌రీక్ష‌లు జూన్ 23 నుంచి 29 వ‌ర‌కు నిర్వ‌హించిన ఎన్టీఏ.. ఈ నెల 11న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version