ఏడేళ్ళ తర్వాత కూడా జల దోపిడీ ఆగడం లేదు

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ళ తర్వాత కూడా జల దోపిడీ(Water exploitation) ఆగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై జగిత్యాలలోని తన నివాసంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేస్తూ… తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళ తర్వాత కూడా సీమాంధ్ర నాయకులు నీళ్ళు దోచుకుంటుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని మండిపడ్డారు.

జల దోపిడీ/Water exploitation

తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో ఒక లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని… తాజా పీఆర్సీ నివేదిక ప్రకారం అది ఒక లక్షా 91 వేలకు చేరిందని అన్నారు. ఆరు నెలల క్రితమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్… గడిచిన 6 నెలల్లో ఐదుగురిని కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. మళ్ళీ 50 వేల ఉద్యోగాలంటూ ప్రకటించడం ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

2018 ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కేసీఆర్ కు ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ఉద్యోగాల భర్తీ చేసే వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేసారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ న‌ర్సులను విధుల్లోంచి తొలగించడం బాధాకరమని అన్నారు. ఒక్క కలం పోటుతో న‌ర్సులను రోడ్డుపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ ముందస్తు చర్యలు కనబడటం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version