జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర సక్సెస్‌

అంతరిక్షంలో మరో చరిత్రాత్మక ఘటం నెలకొంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తో పాటు మరో ముగ్గురితో కూడిన న్యూ షెపర్డ్‌ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్‌ ఈ యాత్రను చేపట్టింది.

ఇందులో భాగంగా అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మరియు అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పాలు పంచుకున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతైన కొన్ని రోజులకే అమెజాన్‌ స్వీయ సంస్థ బ్లూ అరిజిన్‌ ఈ ప్రయోగం చేపట్టడం విశేషం.

సబ్‌ అర్బిటల్‌ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా న్యూ షెపర్డ్‌ యాత్ర సాగింది. బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. నేల నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి విదితమే. జెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలో మీటర్ల ఎత్తుకు వెళ్లింది. భూవాతవరణం దాటక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్న దానిపై నిర్ధిష్ట నిర్వచనమేమీ లేదు.