హోటల్స్ నిర్వాహకులు జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇష్టానుసారంగా ధరలు పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్న హోటల్స్ నిర్వాహకులు నీట్ నెస్ విషయంలో మాత్రం రాజీ పడుతున్నారు. ప్రజల ప్రాణాలు అంటే వీరికి లెక్కలేదు అన్నట్లుగా అపరిశుభ్రమైన టిఫిన్స్, పురుగులు పడినవి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బుకాయించడంతో పాటు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన ఇడ్లీలో జెర్రీ వచ్చింది. ఈ ఘటన జిల్లాకేంద్రంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్‌లో జరిగింది. పిల్లలకు ఇడ్లీ తినిపించే టైంలో చనిపోయిన జెర్రీని చూసిన కస్టమర్ యాజమానితో గొడవకు దిగాడు. జెర్రీ కాదని దారం అంటూ నోట్లో వేసుకున్న ఓనర్.. అది జెర్రీ అని తేలడంతో వెంటనే ఉమ్మేశాడు. ఆ తర్వాత జెర్రీ వచ్చిన ఇడ్లీలను బల్దియా టాక్టర్‌లో తరలించే ప్రయత్నం చేశాడు.ఓనర్‌ను అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డుపై బాధితుడు బైఠాయించాడు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కస్టమర్ డిమాండ్ చేశాడు.