తాడిపత్రిలో పంతం నెగ్గించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

-

అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయనకు  అధికారులు షాక్ ఇచ్చారు. సమావేశానికి ఎవరూ వెళ్లలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే నిరసన వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి మున్సిపల్ ఆఫీసులోనే బైఠాయించారు.

రాత్రి స్నానం, బస కూడా అక్కడే చేశారు. మంగళవారం ఉదయం అధికారులు వచ్చే వరకూ కూడా మున్సిపల్ కార్యాయంలోని ఉండి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అధికారులు రావడంతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు తనకు సహకరించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం తనతో కలిసి రావాలని కోరారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా మారింది. అక్రమ కట్టాల కూల్చివేతతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ సెగ మున్సిపల్ కార్యాలయానికి తగిలింది. మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ఉండటంతో పెద్దారెడ్డి ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తున్నారు. దీంతో ప్రతి రోజూ తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version