ఈ అమ్మడు నక్క తోక తొక్కిందా..క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డేకు చాన్స్

-

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ..ప్రజెంట్ ఫుల్ బిజీ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఓ వైపున టాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరో వైపున కోలీవుడ్, బాలీవుడ్ పిక్చర్స్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ భామకు..అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ భామ నటించిన చిత్రాలు ఇటీవల విడుదలై కొంత డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. అయినా, ఆ ప్రభావం ఈ సుందరి పైన పడకపోవడం గమనార్హం.

ఈ మె నటించిన..తలపతి విజయ్ ‘బీస్ట్’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే, ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. అయినప్పటికీ ఈ భామకు క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ ‘‘జనగణమన(JGM)’’ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయడం కోసం పూజా హెగ్డేను మేకర్స్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ‘జనగణమన’.

వీరి కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. దేశభక్తిని, యాక్షన్‌ను మిళితం చేస్తూ తెరెకెక్కే ‘‘జనగణమన’’లో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘‘జనగణమన’’లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతున్నదని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కూడా. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పిక్చర్ లో కనిపించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version