అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య.. అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్ బైడెన్.. వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డగ్ఎంహాఫ్కు ముద్దు పెట్టారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి జో బైడెన్ మంగళవారం ప్రసంగించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నిఘా బెలూన్ ఘటనతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్.. డ్రాగన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో బైడెన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి బైడెన్ మంగళవారం ప్రసంగించారు. చైనా నిఘా బెలూన్ అంశం సహా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఆ సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డగ్ ఎంహాఫ్‌కు కిస్ పెట్టారు. వెంటనే ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jill Biden kissed Kamala Harris’s right on the lips. #sotu2023 #StateOfTheUnionAddress pic.twitter.com/NT9KtVdsE0
— Terrence K. Williams (@w_terrence) February 8, 2023