నేటి కాలంలో ప్రతి ఒక్కరూ జియో సిమ్ లను ఎక్కువగా వాడుతున్నారు. జియో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్ గా ఉంటుందని ప్రతి ఒక్కరూ జియోనే వాడుతున్నారు. దీని ద్వారా అన్ లిమిటెడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు జియో సంస్థ ఏదో ఒక ఆఫర్లతో ముందుకు వస్తూనే ఉంటుంది. చాలామంది ఆ ఆఫర్లను వినియోగించుకుంటారు ఈ క్రమంలోనే తాజాగా జీవో సంస్థ మరో అదిరిపోయే ఆఫర్ ను తీసుకువచ్చింది.

సెప్టెంబర్ 5న వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ డేటాను ఫ్రీగా ఇవ్వబోతున్నట్లుగా పేర్కొంది. రూ. 349 ప్లాన్ రోజుకు 2GBను 12 నెలల పాటు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరో నెల సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు ఉచితంగా ఆ ప్లాన్ ను అందిస్తామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు 5జి యూజర్లు అందరూ ఎలాంటి రీఛార్జ్ లేకుండా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 4G యూజర్లు రూ. 39తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని జియో యూజర్ లో వాడుకోవాలని జియో సంస్థ పేర్కొంది.