ఏపీలో కలకలం..గణేష్ నిమజ్జన వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేస్తూ రచ్చ చేసారు కొంత మంది యువతులు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తేలికచర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రికార్డింగ్ డాన్స్ పేరుతో ట్రాక్టర్ పై యువకులు, అలాగే కొంత మంది లేడీస్ అశ్లీల నృత్యాలు చేశారు.

వాస్తవంగా ఈ సంఘఠన ఆగస్టు 31న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దీంతో గణేష్ నిమజ్జన వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేస్తూ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
గణేష్ నిమజ్జన వేడుకల్లో అశ్లీల నృత్యాలు..
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తేలికచర్ల గ్రామంలో ఘటన
రికార్డింగ్ డాన్స్ పేరుతో ట్రాక్టర్ పై యువకుల అశ్లీల నృత్యాలు
ఆగస్టు 31న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/RafxmFcdFY
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2025