రైతులకు మోడీ సర్కార్ దసరా కానుక..కేంద్ర ప్రభుత్వం “పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన” ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు మూడు విడతలలో రూ. 2000 చొప్పున మొత్తం సంవత్సరానికి రూ. 6 వేల సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పీఎం కిసాన్ పథకం 21వ విడతపై తాజాగా అప్డేట్ వచ్చింది.

దసరా కానుకగా అక్టోబర్ నెలలో ఈ నిధులను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో రైతుల అకౌంట్లోకి పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.