కొడుకు పెళ్లి కానుకగా జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్..!

-

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈనెల 1 నుండి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే వీరి పెళ్లి జూలై 12న జరగబోతోంది. ఈ క్రమంలో జియో యూజర్లకి అంబానీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. జియో యూజర్స్ కి రూ.259 రీఛార్జ్ ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరో మూడు రోజుల్లో గడువు ముగిసిపోతుంది.

వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని వాట్సాప్ లో లింకులు వైరల్ గా మారాయి అయితే ఇది స్కామ్ అని జియో విడుదల చేయలేదని ఎటువంటి గిఫ్ట్ ని ప్రకటించలేదని రిలయన్స్ చెప్పింది. అనంత్ అంబానీ పెళ్లి అని ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇది కేవలం ఫేక్ అని ఈ నకిలీ వార్తల్లో నిజం అసలు లేదని పోలీసులు చెప్తున్నారు. వాట్సప్ లో వచ్చే లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version