సామాన్య వినియోగదారులకు జియో మరో షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది జియో. ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తోంది జియో. దేశవ్యాప్తంగా డేటా వినిమయం భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ డాటా ప్లాన్‌ను ఎత్తివేసి ఆ స్థానంలో రోజుకు 1.5 జీబీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది.

28 రోజుల కాలపరిమితితో రూ.299 ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి ఇతర టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు జియో మాత్రం ఇప్పటివరకు రూ.249 ప్లాన్‌ను అందిస్తుండగా.. తాజాగా దీనిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది.