విద్యార్థులకు శుభవార్త.. రేపు ఓయూలో జాబ్‌ మేళా

-

ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో (మోడల్‌ కెరియర్‌ సెంటర్‌)లో శుక్రవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్‌ టి. రాము ఒక ప్రకటనలో తెలిపారు. సియారా గ్రూప్‌లో మార్కెటింగ్‌ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాము. ఈ మేళాకు హాజరయ్యేందుకు ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు రాము.

18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా మేళాకు హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని సూచించారు రాము. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు 9885030364 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు రాము.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version