టాలీవుడ్ లోకి ‘బావ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత…ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘బాపు గారి బొమ్మ’ సాంగ్ కు తన అభినయంతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది.
తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఈ సుందరి దక్కించుకోలేకపోయింది. అంతలోపే ఈ భామ..తనకు నచ్చిన వ్యాపార వేత్త నితిన్ రాజు తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ప్రేమ కాస్త వివాహ బంధంగా మారింది. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఈ క్రమంలోనే ప్రణీత..తల్లి అయినప్పటికీ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఇక తాజాగా ప్రణీత ..సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు..ఆమె ఫిల్మ్స్ లోకి రీఎంట్రీని కన్ఫర్మ్ చేస్తున్నాయి. బికినీలో బీచ్ లో దిగిన ఫొటోలను ప్రణీత..షేర్ చేసింది. బ్లాక్ కలర్ హాట్ బికినీలో దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వానాకాలంలో చెమటలు పట్టించడమే కాదు..హీటెక్కిస్తున్న ప్రణీత అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో తగ్గేదేలే అన్నట్లు ప్రణీత బిహేవ్ చేస్తున్నదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇలా బికినీలో తల్లి అయిన తర్వాత కనిపించడం సరి కాదని కొందరు నెటిజన్లు ప్రణీతను ఉద్దేశించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.