స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగాలు..టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో..

-

ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలకు సంభంధించిన ఖాళీలను భర్థీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లడఖ్లోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు: 797

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్/ఎలక్షన్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్/జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్-II, ఆర్డర్లీ, సఫాయివాలా, బేరర్ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13, 2022.

అప్లికేషన్ ఫీ..

జనరల్ అభ్యర్ధులకు: రూ.100

ఎస్సీచేసుకోగలరు/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 2022.

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోనే వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తీగా చదివి అప్లై చేసుకోగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version