బ్రహ్మం గారి కాల జ్ఞానం గురించి ఈ విషయాలు ఎవరికీ తెలియవు..?

-

హిందువులు సాంప్రదాయలకు ఎంత విలువ ఇస్తారో, బ్రహ్మంగారి కాల జ్ఞానం కు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో మనుషులు ఎలా ఉండాలి..జీవన విధానాల గురించి వివరంగా రాశారు.కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావడం గమనార్హం.భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కాలజ్ఞానంలో ఉన్న విషయాలే..

 

ఆయన చెప్పినట్లు అన్నీ అలానే జరగడం విశేషం..అందులో 40 రోజుల్లో గాకాశీలో ఉన్న దేవాలయం పాడుబడుతుందని బ్రహ్మంగారు చెప్పగా 1910 – 1912 సమయంలో ఆయన చెప్పిన విధంగానే జరగడం గమనార్హం. 16 సంవత్సరాల పాటు అంబ పాలిస్తుందని బ్రహ్మంగారు చెప్పగా పదహారు సంవత్సరాల పాటు ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు..ఇది అక్షరాల నిరూపించ బడింది..ఆయన చెప్పినట్లు నూటికి నూరు శాతం జరిగాయి..చిత్ర విచిత్రమైన యంత్రాలు అందుబాటులోకి వస్తాయని బ్రహ్మంగారు వెల్లడించారు.

నీళ్లతో దీపాలను వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పగా ప్రస్తుతం నీళ్లతోనే కరెంట్ ఉత్పత్తి జరుగుతోందనే సంగతి తెలిసిందే. బ్రహ్మంగారు కపట యోగులు విపరీతంగా పెరుగుతారని చెప్పగా ప్రస్తుతం దేశంలో దొంగ బాబాలు ఎక్కడ చూసిన కనిపిస్తారు.బ్రాహ్మణుల మనుగడ తగ్గుతుందని కాల జ్ఞానం లో రాసి వుంది.ఇకపోతే మనుషుల తీరు పూర్తిగా మారి పోతుందని అన్నారు.అందుకే ఇప్పుడు మనుషులు వావీవరసలను మరిచిపోయి మృగాలలా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

కొండ గుహలలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలలో చాలా విషయాలు ఇప్పటికీ జరగలేదు..అవి రానున్న రోజుల్లో తప్పక నిజం అవుతాయని ఆయన భక్తులు విస్వసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version