విజయ్ దేవరకొండ‌పై యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

-

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తరుణ్ భాస్కర్ తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’తో ఫుల్ సక్సెస్ అయిపోయాడు. ఆ ఒక్క సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్..ఇద్దరి లైఫ్ సెట్ అయిందని చెప్పొచ్చు.

ఇకపోతే తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాదు మంచి యాక్టర్ గాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా’ సినిమాలలో నటించాడు. తరుణ్ భాస్కర్ ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండపైన ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

తనకు విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే అప్పుడు విజయ్ తో సినిమా చేస్తానని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ సమయంలో జరిగిన భయానక ఘటన గురించి వివరించారు.

ఫిల్మ్ లో ..ఒక డ్రైవింగ్ సీన్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయని, అప్పుడు మొదట విజయ్ దేవరకొండ భయపడ్డారని చెప్పాడు. ఈ క్రమంలోనే సదరు వాహనం ఒక చెట్టు దగ్గర ఆగిపోయిందని, వెంటనే తాను విజయ్ ను ప్రమాదం జరిగితే భయపడవా? అని అడిగితే..తొలుత భయపడ్డానని, కానీ, తర్వాత ప్రమాదం జరిగితే ముగ్గురం చనిపోతాం కదా.. అని లైట్ తీసుకున్నానని చెప్పాడని తరుణ్ భాస్కర్ తెలిపాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version