హైదరాబాద్ కేంద్రంగా జరగబోయే అందాల పోటీలపై తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తాజాగా స్పందించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగడంతో పాటు పెట్టుబడులను సైతం ఆకర్షించవచ్చు. సుమారు 140 దేశాల వారు ఇక్కడికి వస్తారు.
ప్రపంచం దృష్టి మన రాష్ట్రంపై పడుతుంది. అందాల పోటీ లు అంటే ఇంకో కోణంలో చూడొద్దు. ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు, మనోధైర్యం, సంకల్పం ఇస్తుంది’అని ఆయన చెప్పుకొచ్చారు.ఇదిలాఉండగా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు ఉండవు కానీ, అందాల పోటీలకు రూ.250 కోట్లు కేటాయించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.