కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

-

కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన ఉమ్మడి కడప జిల్లా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1గంటలకు నామినేషన్ల పరిశీలన తరువాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.

గత జిల్లా పరిసత్ చైర్మన్ గా పని చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాలీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఉమ్మడి కడపజిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలకు 49 వైసీపీ, ఒక స్థానం టీడీపీ దక్కించుకున్నాయి. ఎన్నికల అనంతరం ఇద్దరూ జడ్పీటీసీలు మరణించారు. 48 జడ్పీటీసలకు ఒక జడ్పీటీసీ తన పదవీకి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 6 మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరగా.. ఒకరు బీజేపీలో చేరారు. దీంతో కూటమికి 8 మంది జడ్పీటీసీల బలం చేకూరింది. కపడ జిల్లా పరిషత్ లో వైసీపీకి 39 మంది జడ్పీటీసీల బలం ఉంది. వైసీపీ నుంచి బ్రహ్మంగారి మఠం మండల జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news