బీఆర్ఎస్ కు ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్తకాదు : కేటీఆర్

-

బీఆర్ఎస్ కు ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్తకాదు  అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యపేటలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏ యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో.. అదే యూట్యూబ్ వాళ్లను గుడ్డలూడదీసి కొడతడంటా. ఇది వరకు ఒక్కొక్క నాయకుడిని నీచాది నీచంగా మాట్లాడి.. ప్రజల మనస్సును కరాబ్ చేసి.. లేని ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చారు.

దేశపతి శ్రీనివాస్ రావు మంచి పాట రాశాడు. గోవిందా.. గోవిందా ఆరు గ్యారెంటీలు గోవిందా అని రాశాడు. మెడ, తొడ కోసుకుంటానని ఒక్కడూ.. దేవుడి కాడ ప్రమాణాలు మరొకడు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుడు.. పదవీ కాపాడుకోవాలని తప్ప ఏం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి అసూయ తప్ప ఏమి లేదుని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news