తాగి బండి నడిపితే ఉద్యోగం గోవిందా…!

-

తాగి బండి నడిపితే.. ఏమౌతుంది. మా అంటే ఫైన్ వేస్తారు. లేదా.. కౌన్సెలింగ్ ఇస్తారు. సరే… ఓ నాలుగు రోజులు జైలు శిక్ష వేస్తారు. పోనీ.. ఇంకేదైనా శిక్ష వేస్తారా? సో.. వాట్.. మేం మాత్రం తాగే బండి నడుపుతాం. మేం ఫైన్ కట్టడానికి రెడీ… జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం అంటారా? అయితే మీరు ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే… ఫైన్లు, కోర్టులు, జైలు శిక్షలే కాదు.. జాబ్ కూడా ఊస్టింగే అవుతుంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ చేసే కంపెనీ వివరాలు తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆ ఉద్యోగి బాధ్యతారాహిత్యంతో డ్రంకెన్ డ్రైవ్ చేయడంపై కంపెనీకి ఫిర్యాదు చేశారు. కంపెనీకి లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వాళ్లు ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ప్రైవేటు ఉద్యోగి అయినా.. సంబంధిత డిపార్ట్ మెంట్ కు లెటర్ రాసి వాళ్ల ఉద్యోగం ఊస్ట్ చేసేస్తున్నారు. అందుకే మందుబాబులూ కాస్త జాగ్రత్త. లేదంటే జాబ్ కూడా ఊస్టయ్యే ప్రమాదం ఉంది.

స్టాచుటరీ వార్నింగ్.. మద్యపానం ఆరోగ్యానికి, ఉద్యోగానికి హానికరం…

Read more RELATED
Recommended to you

Exit mobile version