సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ లోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…

న్యూఢిల్లీ లోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ లో మొత్తం 163 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. సైంటిస్ట్ బీ, అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టులున్నాయి. అలానే అకౌంట్స్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంటు వంటి పోస్టులు కూడా వున్నాయి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్లకి 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. అర్హత వివరాల లోకి వెళితే… పదో తరగతి/ఇంటర్మీడియట్/డిప్లొమా/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. మార్చి 31, 2023వ తేదీ లోపు ఆన్‌లైన్‌ విధానం లో అప్లై చేసుకోవాల్సి వుంది.

రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రూ.18,000ల నుంచి రూ.1,77,500ల వరకు సాలరీని చెల్లిస్తారు. పూర్తి వివరాలని https://cpcb.nic.in/jobs.php లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version