పదో తరగతితో భారత సైన్యంలో ఉద్యోగాలు

-

భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారా? దేశ సేవలో భాగం కావాలనుకుంటున్నా? మీరు పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హతను కలిగి ఉన్నారా? అయితే, మీ కలను సాకారం చేసుకోవచ్చు.

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ మిలిటరీ అకాడమీలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: కుక్, ఎంటీ డ్రైవర్, బుక్ మేకర్/ రిపెయిడర్, ఎల్‌డీసీ, మసాల్చి, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్(సఫాయివాలా), గ్రౌండ్స్ మెన్, జీసీ ఆర్డర్లీ, ల్యాబొరేటరీ అటెండెంట్, బార్బర్
వయస్సు: పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి
దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జనవరి 14
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్టులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2గంటలు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

Read more RELATED
Recommended to you

Exit mobile version