టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ రైల్వేలో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

Indian-Railways

లెవల్‌ 1, లెవల్‌ 2 కింద 17 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హతల గురించి చూస్తే.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ పూర్తి చేసుండాలి. లేదంటే తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి. ఇక వయస్సు వివరాలను చూస్తే..

వయస్సు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ నవంబర్‌ 23, 2022. ఇక దరఖాస్తు ఫీజు వివరాలను చూస్తే.. జనరల్‌ అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులు అయితే రూ.250 చెల్లించాల్సి వుంది.

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. స్టెఫెన్డ్ ని కూడా పొందొచ్చు. సౌతర్న్‌ రైల్వే పోస్టులు 14, ఐసీఎఫ్‌ పోస్టులు 3 వున్నాయి. పూర్తి వివరాలను https://sr.indianrailways.gov.in/ లో చూడచ్చు. అలానే https://sr.indianrailways.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version