విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు… రాత పరీక్ష లేకుండానే…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ లోని జిల్లా రెవెన్యూ శాఖ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ లోని జిల్లా రెవెన్యూ శాఖ లో ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏడు డేటా ఎంట్రీ పోస్టులు కాళీగా వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇక అర్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ తో పాటు కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19, 2023 తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవచ్చు. ఇక సాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.18,5000ల వరకు జీతంగా ఇస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే.. దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆఫ్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి. ఈ కింది అడ్రెస్ కి పంపాల్సి వుంది.

చిరునామా:

జిల్లా కలెక్టర్‌ మరియు ఎక్స్‌ అఫిసియో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, APCOS – జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version