చంద్రబాబు సర్కార్ కు మాజీ మంత్రి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ..రాశారు. పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పటల్ నిర్మించాలంటూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ శ్రీనివాస్ వర్మకు బహిరంగ లేఖ రాశారు జోగయ్య. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు,నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు ,విశ్రాంతిభవనాలు, నిర్మించడానికి ప్రాధాన్యత కాదని రోడ్లు నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగునీరు విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవి ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని లేఖలో వెల్లడించారు.
ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉందన్నారు జోగయ్య. నివాస పరిపాలన రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వేచించి ఖర్చు చేయడానికి పునుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రాధాన్యతగా కనబడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహించారు. ఇది నిజమేనా రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అదే ప్రభుత్వ లక్ష్యం కావాలి అన్నారు.