పార్లమెంట్ ఆవరణలో బీజేపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం అయింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తోయడంతోనే తన తలకు గాయం అయిందని ప్రతాప్ చంద్ర ఆరోపిస్తున్నారు.
అంబేద్కర్ వివాదం గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మణిపూర్ ఘటన, అదానీ ఘటన లపై కాంగ్రెస్ నిన్న ప్రధాని మోడీ-అదానీ పై వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నీ రాజ్ భవన్ ల ముట్టడి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజ్య సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన కామెంట్స్ వల్లనే ప్రతిపక్ష నేతలు అధికార-నేతల మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ ఉభ సభలను రెండు గంటల పాటు వాయిదా వేశారు.