తిరుమలలో తెలంగాణ వాసులను పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తిరుమలలో తెలంగాణ ప్రాంత వాసులను పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్….దీంతో టిటిడి పై సీరియస్ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య వున్న ఏకైక అనుసంధానం తిరుమల అన్నారు. గతంలో చంద్రబాబు,జగన్ హయంలో తెలంగాణ ప్రజలను… ఏపి ప్రజలతో సమానంగా చూసారని వెల్లడించారు. ఇప్పుడు తిరుమలలో ఆ పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపి ప్రజలే ఎక్కువ లబ్ది పొందుతున్నారన్నారు. చైర్మన్ తెలంగాణలో వున్నారు….వారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు. పాలకమండలి సభ్యులుగా తెలంగాణ వాసులకు ఎక్కువ ఇచ్చినా ఏమి లాభం…వారికి కావలసిన వారికి ఇచ్చుకున్నారని చురకలు అంటించారు.
తిరుమలలో తెలంగాణ ప్రాంత వాసులను పట్టించుకోవడం లేదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్య
గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్న మాజీ మంత్రి pic.twitter.com/uOSAaDXnf5
— BIG TV Breaking News (@bigtvtelugu) December 19, 2024