యూట్యూబ్ సంపాదనతో ఇల్లు కొన్న పిల్ల..ఖరీదు తెలిస్తే షాకే..!! 

-

మనలో చాల మందికి యూట్యూబ్ మంచి కాలక్షేపం, అందులో  వీడియోస్ చూస్తూ ఉంటే సమయం కూడా తెలియదు. మనకి తెలియని విషయాలని నేర్చుకోవడానికి, మనకి తెలిసిన విషయాలని అందరికి చెప్పడానికి ఈ సోషల్ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎంతో మంది యూట్యూబ్ ని వృత్తిగా చేసుకుని డబ్బులు కూడా సంపాదించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అవుతుంటారు..ఈ కోవకి చెందినదే అమెరికాకి చెందిన 16 ఏళ్ళ జోజో సివా అనే యువతి..

ప్రపంచ వ్యాప్తంగా ఈమె పేరు తెలియని వాళ్ళు ఉండరు. యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టి  తన పాటలతో, నృత్యాలతో కోటిన్నర మంది ఫోల్లోవర్స్ ను తన సొంతం చేసుకుంది. తను ఇచ్చే అప్ డేట్స్ కోసం కోట్లాది మంది ఆమె ఫాలోవర్స్ ఎదురు చూస్తుంటారు. ఈమెకి ఉన్న క్రేజ్ అక్కడి హాలీవుడ్ స్టార్స్ కి సమానంగా ఉంటుందంటే ఈమె ఎంతగా పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తన వీడియోల ద్వారా నిత్యం వార్తల్లో నిలిచే జోజో ఈ సారి తాను కొనుగోలు చేసిన ఇంటిని తన ఫాలోవర్స్ కి చూపిస్తూ మరింతగా పాపులర్ అయ్యింది.. ఎందుకంటే ఆమె కొనుగోలు చేసిన ఇంటి ఖరీదు అక్షరాలా 25 కోట్ల పైమాటేనట..

 

ఆమె తన యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించిన సొమ్ముతో  ఈ ఇంటిని కొనుగోలు చేశానని తెలిపింది. తన కొత్త ఇంటిని పరిచయం చేస్తూ, ఆమె గురువారం విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆరువేల చదరపు గజాల విస్తీర్ణం లో కట్టిన ఆ ఇల్లు ఎంతో చూడముచ్చటగా ఉందని ఆమె ఫాలోవర్స్  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version