అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయంలో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు బాలురు గల్లంతు అయ్యారు. జలాశయంలో రీల్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. జోలపుట్ జలాశయంలో రీల్స్ కోసం శనివారం సాయంత్రం నాటు పడవ పై గౌతం,శివ,అమిత్ ముగ్గురు విద్యార్దులు వెళ్లారు.
ఇక ఈ తరుణంలోనే…జలాశయంలో రీల్స్ చేస్తుండగా ఇద్దరు బాలురు గల్లంతు అయ్యారు. ఇందులో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరగా అమిత్, శివ గల్లంతు అయ్యారు. ముగ్గురు విద్యార్దులు జోలాపుట్ లో పడవ తరగతి చదువుతున్నారు. ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా జోలాపుట్ ఆర్ ఎఫ్ కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అటు గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అల్లూరి జిల్లా ముంచిం గిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయంలో పడవ బోల్తా కొట్టిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.