ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనం అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.55కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఇవాళ సాయంత్రం 5.10కి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇక అటు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా… ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని అన్నారు.. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.