కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ బదలాయింపుకు రంగం సిద్దమైంది. ఇందుకు కోసం ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించింది. ఉద్యోగులను తమ సొంత జిల్లాలకు పంపే విధంగా కార్యచరణ ప్రారంభం అయింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ఆధారంగా బదలాయింపు కోసం సీనియర్ల జాబితా సిద్ధమైంది. నేటి నుంచి అన్ని జిల్లాల్లో ఉద్యోగులు కలెక్టర్లకు, శాఖాధిపతులకు ట్రాన్స్ ఫర్ల కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. సొంత జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుల కోసం ఈనెల 15న ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఉద్యోగుల బదలాయింపు తర్వాత వారం రోజుల్లో కొత్త పోస్టుల్లో చేరేలా ఆదేశాలు ఉన్నాయి.