టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌..?

-

టీమిండియా తదుపరి ఫీల్డింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లా వైరలవుతుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుండటంతో అతని కోచింగ్‌ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్‌ ద్రావిడ్ బృందంలో ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్‌ టీమ్‌ను ఎంపిక చేయనుంది.ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నెల (జూన్‌) చివరి వారంలో గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఎంచుకునే విషయంలో గంభీర్‌ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్‌ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం . 2022, 2023 ఐపీఎల్‌ సీజన్లలో గంభీర్‌ మెంటార్‌, రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి సేవలందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version