ఫుల్‌ జోష్‌లో “జోష్‌” షార్ట్‌ వీడియోస్‌ యాప్‌.. టిక్‌టాక్‌ను మించేలా ఉందే..!

-

చైనా యాప్‌ల‌లో ఒక‌టైన టిక్‌టాక్‌ను ఎప్పుడైతే నిషేధించారో అప్ప‌టి నుంచి దేశంలో టిక్‌టాక్ ప్రియులంద‌రూ అలాంటి యాప్‌ల కోసం తీవ్రంగా వెదికారు. ఆ మోజులో కొన్ని యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడారు కూడా. కానీ ఏ యాప్ కూడా టిక్‌టాక్ లాంటి ఫీల్‌ను ఇవ్వ‌లేదు. కానీ ప్ర‌ముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ ఆవిష్క‌రించిన జోష్ యాప్ మాత్రం టిక్‌టాక్‌కు మారుపేరుగా నిల‌వ‌డంతో అనేక మంది ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్ప‌టికీ ఆ ట్రెండ్ కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే జోష్ యాప్ ప్ర‌స్తుతం 15 మిలియ‌న్ల డౌన్‌లోడ్ల‌ను పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా ముందుకు దూసుకెళ్తోంది.

జోష్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. 14 భాష‌ల్లో యూజ‌ర్ల‌కు సేవ‌ల‌నందిస్తోంది. అచ్చం టిక్‌టాక్‌ను పోలి ఉండ‌డంతో జోష్ యాప్‌ను చాలా మంది యూజ‌ర్లు ఆద‌రిస్తున్నారు. ఇక జూలై 4వ తేదీన ఈ యాప్‌ను లాంచ్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఈ యాప్ 10 మిలియ‌న్ల డౌన్‌లోడ్ల‌ను పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో యాప్‌కు ప్లే స్టోర్‌లోనూ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు https://bit.ly/2WXHTis

కాగా టిక్‌టాక్ మాదిరిగానే ఇందులోనూ యూజ‌ర్లు త‌మ వీడియోల‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చు. ఇత‌రులు పోస్ట్ చేసిన వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. అలాగే భిన్న ర‌కాల విభాగాల్లో వీడియోల‌ను వీక్షించే వీలు క‌ల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version