Kavyasontyana Tips: అందమైన స్కిన్ కోసం మూడు చిట్కాలు.. ఈ సమస్యలే ఉండవట..!

-

అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని ఉంటుంది. చక్కగా అందంగా చర్మాన్ని ఉంచుకోవాలని చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కటి స్కిన్ ని పొందాలంటే ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.

ఈ ఇంటి చిట్కాలతో ఈజీగా మనం అందాన్ని పెంచుకోవచ్చు. చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. జోష్ క్రియేటర్ కావ్య సొంత్యానా 3 ఇంటి చిట్కాలని చెప్పారు. గ్లోయింగ్ స్కిన్ పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈమె మంచి క్రియేటర్. ఛాలెంజ్స్ లో వంటి వాటిలో కూడా ఈమె పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక ఆమె చెప్పిన చిట్కాలు గురించి చూస్తే..

మొదటి చిట్కా:

పింపుల్స్ తో బాధపడే వాళ్ళు ఇలా చేస్తే ఆ సమస్య నుండి బయటపడచ్చట. అలానే గ్లోయింగ్ స్కిన్ కూడా సొంతం చేసుకోవచ్చు.
రోజుకి ఎన్ని నీళ్లు తాగాలనిపిస్తే అన్ని నీళ్లు తాగితే మంచిదని అంటున్నారు. మూడు నుండి నాలుగు లీటర్ల వరకు ప్రతి రోజు తీసుకుంటే మంచిది. ఇలా తాగడం వలన మంచి స్కిన్ ని సొంతం చేసుకోవచ్చు.

రెండవ చిట్కా:

నేచురల్ పద్ధతుల్ని పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇలాంటివి ఫాలో అవ్వడం మంచిదని మరో చిట్కా ని చెప్పారు.

పసుపు:

పసుపు లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలు ఉంటాయి సోరియాసిస్ సమస్యను కూడా ఇది తొలగిస్తుంది.

ఎలా దీనిని ఉపయోగించాలి..?

తేనె, పెరుగు, పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించి 15 నుండి 20 నిమిషాలు ఉంచేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది.

మూడో చిట్కా:

కొబ్బరి నూనె మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా చర్మాన్ని అందంగా మారుస్తుంది. క్లియర్ స్కిన్ ని పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మం ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది.
నల్లగా చర్మం ఉన్నచోట కొబ్బరి నూనెని అప్లై చేయండి ఆ తర్వాత నల్లని మచ్చలు తొలగిపోతాయని కావ్య ఈ టిప్ ని షేర్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version