ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్’ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వెల్లడించిన నివేదిక సంబంధిత వెబ్‌సైట్‌లో ఇప్పుడు కనిపించడంలేదు. ఎలాంటి సమాచారాన్ని వెల్లడించవద్దంటూ వెబ్‌సైట్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. గందరగోళం నివారణకేననిఎన్డీఎంఏ చెబుతోంది.
జోషీమఠ్‌లో కొంతకాలంగా భూమి వేగంగా కుంగిపోతోందని ఇస్రోకు చెందిన ఈ కేంద్రం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెం.మీ మేర కుంగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి.. ఉపగ్రహ చిత్రాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన తరుణంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆ నివేదిక కనిపించకుండా పోయింది. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు తెలుస్తోంది.