Greenko Group: ఈ రేస్‌ కేసులో ట్విస్ట్‌..బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు !

-

Greenko Group: ఫార్ములా – ఈ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్‌ పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు చెల్లించిన గ్రీన్ కో అంటూ వార్తలు ప్రచురణ చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో మరియు దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ముడుపులు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. రేస్ కు సంబంధించిన చర్చలు మొదలు అయినప్పటి నుంచే బాండ్లను కొనుగోలు చేసిందట గ్రీన్ కో సంస్థ. 8 ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రతిసారి రూ. కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసిన గ్రీన్ కో కంపెనీ… ఫార్ములా- ఈ రేస్ లో కూడా స్కాం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version