తారక్ క్లారిటీగానే ఉన్నట్లు ఉన్నారు!

-

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది… చంద్రబాబుకు వయసు మీద పడుతుంది… పార్టీని నిలబెట్టే స్టామినా లోకేష్‌కు లేదు. దీంతో టీడీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు… జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి… పార్టీని నడిపించాలని, ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి అభిమానులు… ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవని క్లారిటీ ఉంది.
ఆయన సినిమా రంగంలో టాప్‌లో ఉన్నారు.. ఇప్పుడు అందరివాడుగా.. సినీ ఫీల్డ్‌లో దూసుకెళుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి రావడం కష్టం. అలాగే డైరక్ట్‌గా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆ విషయం తాజాగా ఎన్టీఆర్… చంద్రబాబు కంటతడి పెట్టుకున్న విషయంపై స్పందించిన దాని బట్టి అర్ధమవుతుంది.

తాజాగా అసెంబ్లీలో కొందరు వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు ఎప్పుడూలేని విధంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ అంశంపై పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. చంద్రబాబుకు మద్ధతు తెలుపుతూ…వైసీపీ నేతల వైఖరిని తప్పుబడుతున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ అంశాన్ని తప్పుబడుతున్నారు.

ఒకప్పుడు చంద్రబాబుకు ప్రత్యర్ధులుగా ఉన్న నాయకులు సైతం…ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తూ.. వైసీపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. ఇక నందమూరి కుటుంబం కూడా దీనిపై స్పందించి… వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్తితి. అలాగే ఈ అంశంపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. కాకపోతే ఆయన డైరక్ట్‌గా ఎవరి పేర్లు తీయకుండా మహిళలని కించపరచకూడదని, ఇది అరాచక పాలనకు నిదర్శనమని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నానని మాట్లాడారు.
అంటే ఎన్టీఆర్ చాలా డిప్లమాటిక్‌గా మాట్లాడారు…కర్ర విరగకూడదు..పాము చావకూడదు అన్నట్లు రాజకీయంగా ఎలాంటి విమర్శ చేయకుండా, జనరల్‌గా మాట్లాడేశారు. అంటే తాను రాజకీయాల పట్ల ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అలాగే టీడీపీకి మద్ధతుగా ఆయన ఉన్నట్లు కనిపించడం లేదు. రాజకీయాల్లో జోక్యం చేసుకూడదనే అంశంలో తారక్ బాగా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version