బాబు మనసులో జూ.ఎన్టీఆర్ ఆలోచనలు?

-

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే! 2019ఫలితాల దెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. క్షేత్రస్థాయిలో వారు మొదలెట్టిన పోరాటమూ లేదు. కానీ.. రాబోయే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయం అని పైకి చెబుతున్నా… తాము అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పలేని పరిస్థితి! ఈ సమయంలో టీడీపీకి నందమూరివారి సహాయం చాలా అవసరం అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారంట!

NTR

మొన్న బుచ్చయ్య అన్నా, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినా, చంద్రబాబు సభల్లో జూనియర్ పేరున బ్యానర్లు ఎగిరినా, రోడ్లపై ఫ్లెక్సీలు వెలిసినా… అందరికోరికా ఒకటే… జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని, టీడీపీకి పూర్వ వైభవం తేవాలని! అయితే ఈ విషయం బుచ్చయ్యలాంటి వారు కాస్త అటు ఇటుగా చెప్పినా.. ఇంతకాలం బాబు పెడచెవిన పెట్టారు. కార్యకర్తలు కోరుకున్నా.. పట్టించుకోకున్నారు. అయితే… తాజాగా చంద్రబాబు కూడా బుడ్డోడి గురించి ఆలోచిస్తున్నారంట. జూనియర్ సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్నారంట.

అవును… ఫ్యామిలీలో ఏదైనా మాంచి అకేషన్ జరిగితే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని, అక్కడ జూనియర్ తో మాటకలుపుదామని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ అవసరం బాబుకు చాలా ఉంది. సరైన వాగ్ధాటితో జగన్ సర్కార్ పై నిప్పులు చేరిగే స్టార్ క్యాంపైనర్ అవసరం టీడీపీకి చాలా ఉంది. అందుకే సందర్భం చూసుకుని ఎన్టీఆర్ ను దువ్వాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది!

ఇదేజరిగితే జూనియర్ ఎలా ఆలోచిస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. అంతకంటే ముందు చంద్రబాబు ప్రపోజల్ ఏమైఉండొచ్చనే అనుమానం మరీ ముఖ్యమైనది. అవును… జూనియర్ ని చంద్రబాబు కేవలం పార్టీ ప్రచారాలకు మాత్రమే తీసుకుంటారు తప్ప.. లోకేష్ ని ఎంకరేజ్ చేసిన స్థాయిలో ఎంకరేజ్ చేయరు. అంటే… జూనియర్ అలా వచ్చి ఇలా ప్రచారం చేసి.. మళ్లీ వెళ్లి సినిమాలు చేసుకోవాలన్నమాట!

సపోజ్.. ఫర్ సపోజ్.. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రపోజల్ కి అంగీకరిస్తే అది కచ్చితంగా ఆత్మహత్యా సదృశ్యం అవుతుందనేది ఈ సమయంలో బుడ్డోడి ఫ్యాన్స్ మాటగా ఉంది! పార్టీ బాధ్యతలు పూర్తిగా చేతిలో పెడితే “ఒకే” కానీ… ఇలా ప్రచారాని తెచ్చి పనైపోయాక వదిలేసే ఆలోచనలకు మాత్రం జూనియర్ ఒప్పుకోకూడదని వారు కోరుకుంటున్నారు.

మరి ఎన్టీఆర్, చంద్రబాబు కోరిక మేరకు ప్రచారకుడిగా రాజకీయాల్లోకి వచ్చి బలి అవుతారా..? లేక పూర్తి బాధ్యతలు తీసుకుని, తన ఛరిష్మాతో టీడీపీకి పూర్వవైభవం తెచ్చిపెడతారా? అన్నది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version