క‌రోనా మెడిసిన్‌ను విడుద‌ల చేసిన మ‌రో ఫార్మా కంపెనీ..!

-

జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ మార్కెట్‌లోకి క‌రోనా మెడిసిన్‌ను విడుద‌ల చేసింది. రెమ్‌డెసివిర్ మెడిసిన్‌కు గాను ఆ కంపెనీ రూపొందించిన జ‌న‌రిక్ మందు జూబి-ఆర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మెడిసిన్ 100 మిల్లీగ్రాముల వ‌య‌ల్ ధ‌రను రూ.4,700గా నిర్ణ‌యించారు. దీన్ని దేశ‌వ్యాప్తంగా ఉన్న 1వేయికి పైగా హాస్పిట‌ళ్ల‌లో కోవిడ్ పేషెంట్ల చికిత్స కోసం స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ఆ కంపెనీ తెలిపింది.

కాగా ఈ ఏడాది మే నెల‌లో గిలియాడ్ సైన్సెస్‌కు చెందిన రెమ్‌డెసివిర్ మందును త‌యారు చేసేందుకు గాను ఆ కంపెనీతో జూబిలంట్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే జూబిలంట్ జూలై 20న డీసీజీఐ నుంచి జూబి-ఆర్ త‌యారీకి గాను అనుమ‌తులు పొందింది. ఈ క్ర‌మంలోనే ఈ మెడిసిన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుద‌ల చేసింది. దీన్ని కోవిడ్ అత్య‌వ‌స‌ర స్థితి ఉన్న పేషెంట్ల‌కు వాడుతారు.

కాగా ఇప్ప‌టికే మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ మందుకు ప‌లు అనేక మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. ప‌లు కంపెనీలు అధిక ధ‌ర‌ల‌కు ఈ మందును విక్రయిస్తున్నా… కొన్ని కంపెనీలు మాత్రం జ‌న‌రిక్ వేరియెంట్ల‌ను అందుబాటులోకి తెచ్చి త‌క్కువ ధ‌ర‌కే ఈ మందును విక్రయిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version