బిగ్ బ్రేకింగ్ : జగన్ మోహన్ రెడ్డి మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు జ్యుడీషియల్ ఎంక్వైరీ ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశాలు ఇటీవల జరిగిన సందర్భంలో మూడు రాజధానులు, సి ఆర్ డి ఏ బిల్లులు అసెంబ్లీలో ఆమోదింప చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని శాసన మండలి దృష్టికి తీసుకు వచ్చిన సందర్భంలో చైర్మన్ షరీఫ్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడం జరిగింది.

దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకున్న ఈ రెండు బిల్లులకు టీడీపీ అడ్డం పడటంతో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చి అసెంబ్లీలో మండలి రద్దు బిల్లు ఆమోదింప చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్ర పరిధిలో ఉంది. ఇటువంటి తరుణంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించిన ఆ బిల్లు విషయంలో మండల కార్యదర్శి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

 

గవర్నర్ తో ఇటీవల మండలి చైర్మన్ షరీఫ్ భేటీ అయి సెలక్ట్ కమిటీకి రెండుసార్లు లేఖలు పంపించిన మండలి కార్యదర్శి జగన్ సర్కార్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీ మరియు శాసనమండలిలో జరిగిన సమావేశాలు ఆన్ రికార్డులో ఉండటంతో వాటిని గవర్నర్ కి చూపించడం జరిగింది. షరీఫ్ ఇచ్చిన వివరణతో గవర్నర్ బిశ్వభూషణ్ జగన్ సర్కార్ రెండు బిల్లుల విషయంలో అనుసరించిన విధానం మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసే అవకాశం ఉందని కొత్తగా ఏపీలో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version