నేడు రాశిఫలాలు..ఆ రాశి వారు గుడ్ న్యూస్ లు వింటారు..

-

జూన్ 29 బుధవారం రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో చుద్దాము..

మేష రాశి

ఈ రోజు ప్రయాణాలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి కారణమవుతాయి. సమస్యలపై వెంటనే స్పందించడం వల్ల మీరు ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు..ఈరోజు గుడ్ న్యూస్ లు కూడా సంతృప్తిని కలిగిస్తాయి..

వృషభ రాశి..

పెట్టుబడి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొద్దిమంది విలువైన వస్తువులను లేదా గృహోపరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ రోజు ఆహ్వానాలను అందుకుంటారు..కొత్త పనులు సానుకూలంగా సాగు

మిథున రాశి

మిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. మీ రోజు మీ తోబుట్టువుల నుంచి సహాయసహకారాలు పొందుతారు. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో ఓ అద్భతమైన సాయంత్రాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి

ఒక సందేశం ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆర్థిక పరిస్థితులు నిరాశ, బాధను కలిగిస్తాయి..ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి

మీ స్నేహితుల విషయంలో జాగ్రత్త పడండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కుటుంబసభ్యులతో ప్రశాంతమైన రోజులు గడుపుతారు.

కన్యా రాశి

కుటుంబ బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. మీ రోజు మీ జీవితభాగస్వామితో గొడవలు పడే అవకాశముంది..ఈరోజు నిరాశ ఎక్కువగా ఉంటుంది.

తులా రాశి

వ్యాపారంలో, ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్లన ఆర్థికంగా నష్టపోతారు. కొత్త ప్రాజెక్టులు, ప్లాన్‌ల గురించి చెప్పడానికి ఇదే మంచి సమయం. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధి చేకూరుస్తాయి..ఈరోజు చాలా మంచి రోజు..

వృశ్చిక రాశి

ఈ రోజు వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను తెచ్చి పెడుతుంది. ఆఫీసుల్లో అద్భుతమైన వ్యక్తిని కలుస్తారు. మీ బంధువుల నుంచి సర్‌ప్రైజ్ అందుకుంటారు.

ధనస్సు రాశి

ఈ రాశివారు ఈ రోజు ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేదా మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు..శుభవార్తలు వింటారు.ఇంట, బయట సంతోషంగా ఉంటారు.

మకర రాశి

చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ సోదరుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి.

కుంభ రాశి

వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. మీ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువులో ఆశీర్వదించవచ్చు..ఈరోజు కొత్త రుణాలు ఫలించవు..ఆలొచించి నిర్ణయం తీసుకోవాలి.

మీన రాశి

వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీరు అనుకున్న చాలా పనులు నెరవేరుతాయి..శుభవార్తలు వింటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version