రవిబాబుపై బూతు ఛాటింగ్ ఆరోపణలు..!

-

డైరెక్టర్ రవిబాబు ఫేస్ బుక్ చాటింగ్ లో తనతో అసభ్యంగా చాటింగ్ చేశాడని ఓ లేడీ ఆర్టిస్టు ఆరోపించిందట.. ఈ విషయాన్ని ఓ ఛానల్ కూడా టెలికాస్ట్ చేసిందట.. ఈ విషయాన్ని ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. దాదాపు ఐదారేళ్ల నాటి సంగతి.

అసలేం జరిగిందంటే.. అప్పట్లో ఓ ఛానల్ రవిబాబు ఓ లేడీ ఆర్టిస్టుతో అసభ్యంగా ఛాటింగ్ చేశాడని ఓ స్టోరీ టెలికాస్ట్ చేసిందట. అసలు విషయం ఏంటంటే.. అసలు రవిబాబుకు ఫేస్ బుక్ అకౌంటే లేదట. తాను సోషల్ మీడియా అసలు వాడడట. ఇలా తనపై స్టోరీ వచ్చిన విషయం తన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ద్వారా తెలుసుకున్న రవిబాబు.. ఆ జర్నలిస్ట్‌కి ఫోన్‌ చేసి ఏంటి విషయం అని అడిగారట.

ఆ ఛానల్ వాళ్లు మా దగ్గర మీరు పంపిన మేస్సేజలు ఉన్నాయని చెప్పారట. అయితే.. అది నా ఫేస్‌బుక్‌ అకౌంటో కాదో తెలియకుండా ఎలా స్టోరీ వేస్తారని.. అసలు విషయం చెప్పేసరికి ఆ ఛానల్ వాళ్లు నాలిక్కరుచుకుని తప్పైపోయిందని సారీ చెప్పారట. ఇక అసలు విషయం ఏంటంటే.. ఎవరో ఒక పోకిరి రవిబాబు పేరుతో ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసుకుని ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడట.

గతంలో రవిబాబుతో కలసి పని చేసిన ఓ లేడీ ఆర్టిస్టు వాడి వలకు చిక్కిందట. దాంతో రెచ్చిన పోయిన సదరు సైబర్ క్రిమినల్ బూతు మెస్సేజులు పంపడం మొదలు పెట్టాడన్నమాట. అదీ అసలు విషయం. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవిబాబు పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news