వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా అక్టోబర్ 10 న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ నెట్టింటా వైరల్ అవుతోంది. ‘దేవర’ చిత్రం షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు.గోవాలో పది రోజుల పాటు చిత్రీకరణ ఉండే అవకాశం ఉంది.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news