బీజేపీ, BRS లు ఒక్కటే, కేసీఆర్ ఎన్నో హామీలు నెరవేర్చలేదు: జూపల్లి కృష్ణారావు

-

తెలంగాణాలో ఈ సారి జరగనున్న ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత నెలకొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాగైనా కేసీఆర్ గెలిచి వరుసగా మూడవ సారి సీఎంగా గెలవాలన్న కసితో ముందుకు వెళుతున్నారు. కాగా తాజాగా అధికార పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయిన సీనియర్ నాయకులు జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇంతకు ముందు ఎన్నికలలో ఇచ్చిన చాలా హామీలను ఇంకానేరవేర్చకుండా ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. తెలంగాణను కేసీఆర్ సాధించడం కాదు, యువకుల ఆత్మహత్యలు చూడలేని సోనియమ్మ పెద్దమనసు చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారంటూ కాంగ్రెస్ గొప్పతనాన్ని చెప్పారు. గతంలో సోనియాకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేసిన నిస్వార్ధపరురాలు అంటూ జూపల్లి చెప్పారు. అలంటి సోనియా కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి అస్సలు పోలిక లేదన్నారు జూపల్లి కృష్ణారావు.

కాబట్టి ప్రజలంతా గుర్తుంచుకుని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు, పొరపాటున మీరు బిఆర్ ఎస్ కు ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్లే అని క్లారిటీ ఇచ్చారు జూపల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version