నా ఓటమికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలే కారణం – జూపల్లి కృష్ణారావు

-

బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ పెద్దలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.

గతంలో నిరంజన్ రెడ్డి తన చేతిలో ఓడిపోయారని… డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని సవాల్ విసిరారు జూపల్లి. కారణం చెప్పకుండా ఎందుకు సస్పెండ్ చేశారో వివరించాలని కోరారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో తాను ఒకడినని… తాను మాట్లాడిన దాంట్లో తప్పేముందని నిలదీశారు. ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కూడా దొరకదని ఆగ్రహం వ్యక్తం చేశారు జూపల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version