అరటి పండ్లకు రూ.442 బిల్లు వేసిన హోటల్‌పై రూ.25వేల ఫైన్‌..!

-

బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ ఇటీవలే చండీగఢ్‌లోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో కేవలం రెండు అరటి పండ్లకు గాను రూ.442 బిల్లు చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లు వేసిన హోటల్‌పై రూ.25వేల ఫైన్‌ విధించారు.

బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ ఇటీవలే చండీగఢ్‌లోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో కేవలం రెండు అరటి పండ్లకు గాను రూ.442 బిల్లు చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లు వేసిన హోటల్‌పై రూ.25వేల ఫైన్‌ విధించారు. రాహుల్‌ బోస్‌ ఆ హోటల్‌లో జిమ్‌ చేసిన అనంతరం హెల్దీ స్నాక్స్ తిందామని చెప్పి రెండు అరటి పండ్లను ఆర్డర్‌ చేశాడు. అయితే బిల్‌ రూ.20 లేదా రూ.30 వస్తుందని అనుకున్నాడు. కానీ ఆ హోటల్‌ వారు కేవలం 2 అరటి పండ్లకే రూ.442 బిల్లు వేశారు. దీంతో రాహుల్‌ బోస్‌ ఖంగు తిన్నాడు.

రెండు అరటి పండ్లకే అంతటి బిల్లు వేసినందుకు గాను రాహుల్‌ బోస్‌కు ఏం చేయాలో తెలియలేదు. దీంతో ట్విట్టర్‌ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చాడు. రెండు అరటి పండ్లకే రూ.442 బిల్లు వేశారని చెబుతూ ఓ వీడియోను, ఆ బిల్‌ పేపర్‌ను ఫొటో తీసి ట్వీట్‌లో పెట్టాడు. దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా షాకయ్యారు. ఆ హోటల్‌పై మండిపడ్డారు. కేవలం రెండు అరటి పండ్లకు అంతటి భారీ బిల్లు వేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అక్కడి ఎక్సైజ్‌, టాక్సేషన్‌ అధికారులు సదరు జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆ ఘటనపై సరైన వివరణ ఇవ్వాల్సిందిగా హుకుం జారీ చేశారు. అయితే కేవలం రెండు అరటి పండ్లకే అంతటి భారీ బిల్లు ఎందుకు వేశారు ? అనే ప్రశ్నకు ఆ హోటల్‌ వద్ద సమాధానం లేదు. దీంతో హోటల్‌ సిబ్బంది ఇచ్చిన సమాధానానికి అధికారులు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే వారు హోటల్‌కు రూ.25వేల జరిమానా విధించారు. అయితే ఇది కొత్తేమీ కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఏ సందర్భంలోనైనా వినియోగదారులే ఈ విషయంలో విజయం సాధించారు. కనుక మీకు కూడా ఇలాంటి ఘటనలు ఎదురైతే కచ్చితంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. వెంటనే సమస్య పరిష్కారమవుతుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version