కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య బ్యాటింగ్.. బీజేపీ నేత తల పచ్చడి

-

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రికెట్ బ్యాట్ తో హంగామా సృష్టించారు. బ్యాటింగ్ తో చెలరేగి పోయారు. ఆయన బ్యాటింగ్ దెబ్బకు ఓ బీజేపీ నేత తల పగిలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రేవా పట్టణంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌లోని రేవాలో నిర్మించిన మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటౌరా వెళ్లారు. అక్కడి క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు సింధియా బ్యాట్ పట్టుకున్నారు. ఓ బౌలర్‌ బంతిని వేయగా సింధియా దంచికొట్టాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న బీజేపీ యువ మోర్చా మండల శాఖ ఉపాధ్యక్షుడు వికాస్‌ మిశ్రా క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించారు. అది కాస్తా మిస్‌ కావడంతో కంటి పైభాగంలో బంతి బలంగా తాకింది. రక్తం కారడంతో అతడ్ని సంజయ్‌గాంధీ దవాఖానకు తరలించారు. సింధియా దవాఖానకు వెళ్లి వికాస్‌ మిశ్రా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version